శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి రావడాన్ని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈనెల 27న శని త్రయోదశి తిధి వచ్చింది. ఇక నవగ్రహాలలో న్యాయాధికారిగా, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుని అనుగ్రహం కోసం భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి, తెలియక చేసిన పొరపాట్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.